ఇబ్రహీంపట్నం నుంచీ అమరావతి వరకు స్విమ్మింగ్‌ మారథాన్‌ !

 

తెలుగు న్యూస్ టుడే ➤ అమరావతి కృష్ణా నదిలో మంగళవారం స్విమ్మింగ్‌ మారథాన్‌ నిర్వహించారు. యువకుల్లో స్ఫూర్తి నింపేందుకు ఆక్వాడెవిల్స్‌ సభ్యులు 21 మంది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని అమరావతి కరకట్ట వరకు ఈదారు. ఉదయం 6 గంటలకు బయలుదేరిన సభ్యులు మధ్యాహ్నం ఒంటిగంటకు గమ్యాన్ని చేరుకున్నారు. ఇందులో 50 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధులతో పాటు గుంటూరుకు చెందిన ఫెరూనామీర్జా అనే 20ఏళ్ల యువతి పాల్గొన్నారు. ఈతకు వయస్సుతో సంబంధం లేదనడానకి 12 ఏళ్ల బాలుడు కూడా నదిలో ఈతకొట్టారు. స్విమ్మర్లకు రక్షణగా మూడు బోట్లల్లో గజ ఈతగాళ్లు అనుసరించారు. యువతీ యువకుల్లో స్విమ్మింగ్‌ పట్ల స్ఫూర్తి నింపేందుకు మారథాన్‌ నిర్వహించినట్లు ఆక్వాడెవిల్స్‌ అధ్యక్షులు ఎస్‌.రామచంద్రరావు తెలిపారు. ప్రోత్సాహకంగా జ్ఞాపికలు అందజేసినట్లు చెప్పారు.

Leave a Comment