తెలుగు న్యూస్ టుడే ➤ ప్రముఖ సీనియర్ నటి గౌతమి రాజధాని విజయవాడలో సందడి చేశారు . రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి టి. గౌతమి మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని, మనోనిబ్బరం ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనని చెప్పారు.
జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని, మనోనిబ్బరం ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనని సినీనటి టి.గౌతమి పేర్కొన్నారు. ఈ కార్యక్రయాన్ని ప్రారంభించిన గౌతమి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం చెప్పిరాదని, అలాగే క్యాన్సర్ కూడా ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేమన్నారు. పాజిటివ్ థింకింగ్‌తో ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా 1800 అడుగుల క్లాత్‌పై పలువురు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు పెయింటింగ్స్ వేసారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేలా తైలవర్ణ చిత్రాలతో 1800 అడుగుల పెయింటింగ్స్ వేసినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం పొందింది. ఈ సందర్బంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రతినిధులు, రూట్స్ ఫౌండేషన్‌కు సర్టిఫికెట్ అందజేసారు.
రూట్స్ సంస్థ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పీవీఎస్ విజయభాస్కర్, అన్నే శివనాగేశ్వరరావు, చందు, కె.మధవి పాల్గొన్నారు.