పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నాగ్

 

హైద్రాబాద్ న్యూస్ ➤వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ నటుడు నాగార్జున కలిసిన విషయం తెలిసిందే. జగన్‌ను కలిసిన తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో నాగార్జున గుంటూరు నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగార్జున మీడియాకు వివరణ ఇచ్చారు. తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. తనకు రాజకీయాల మీద ప్రత్యేక ఆసక్తి లేదని, ఇతరుల టికెట్‌ కోసం తానెందుకు జగన్‌ను కలుస్తానని నాగార్జున అన్నారు. జగన్‌ మా కుటుంబ సన్నిహితుడు. పాదయాత్ర పూర్తి చేసిన జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు.

Leave a Comment