తెలుగున్యూస్ టుడే ➤ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 25 నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీట్లు భర్తీ కాకపోతే ఆ నష్టాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తామని ఫ్రభుత్వం ఇచ్చిన హామీతో ఇండిగో సర్వీసులు నడపడానికి ముందుకొచ్చింది.
విజయవాడ -సింగపూర్ కు ఈనెల 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే, కానీ గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడానికి తగిన మౌలిక వసతులు లేవంటూ కస్టమ్స్, ఎయిర్‌పోర్టు అధికారులు మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయాశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.18 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చినా జాప్యం చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలోనే ఆర్థిక మంతి అరుణ్‌జైట్లీ, విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాయనున్నట్లు సీఎం తెలిపారు.