అర‌వింద స‌మేత‌ ఆడియో జ్యూక్ బాక్స్ విడుద‌ల !

తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో చేస్తున్న చిత్రం అర‌వింద స‌మేత‌ వీర రాఘవ. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 11న ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి సాంగ్ చిత్రీక‌రణ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన రెండు సాంగ్స్ విడుద‌ల చేయ‌గా వీటికి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. థ‌మ‌న్ సమ‌కూర్చిన మిగ‌తా పాట‌ల కోసం సంగీత‌ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండ‌గా, నిన్న సాయంత్రం యూ ట్యూబ్‌లో ఆడియో జ్యూక్ బాక్స్ విడుద‌ల చేశారు. కేవ‌లం నాలుగు పాట‌ల‌తో కూడిన జ్యూక్ బాక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

జ్యూక్ బాక్స్‌లో ‘‘ఏడ పోయినాడో.., అనగనగనగా, పెనివిటి, రెడ్డి ఇక్కడ సూడు’’ అనే పాటలు ఉన్నాయి. రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు ప్రీ రిలీజ్ వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించి సినిమాపై ఆస‌క్తిని పెంచాల‌ని టీం భావిస్తుంద‌ట‌. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, నాగ బాబు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడు.

Leave a Comment