త్వరలో సైనా, కశ్యప్ ల ప్రేమ వివాహం !

తెలుగు న్యూస్ టుడే ➤ హైదరాబాద్ వేదికగా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు త్వరలో ఒక్కటి కాబోతున్నారు. మహిళా షట్లర్ సైనా నెహ్వాల్, మెన్స్ స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వచ్చే డిసెంబర్‌లో హైదరాబాద్ వేదికగా అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించడంతో డిసెంబర్ 16న దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగే వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్‌కు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇద్దరు బ్యాడ్మింటన్‌లోనే కొనసాగుతూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తాజాగా తెలిసింది. తమ సహచర ఆటగాళ్లకు తమ ప్రేమాయాణం గురించి తెలిసినా.. బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు.

సైనా తన కెరీర్‌లో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించగా కామన్వెల్త్ గేమ్స్, సూపర్ సిరీస్ టోర్నీల్లో పదుల సంఖ్యలో మెడల్స్ కొల్లగొట్టింది. మరోవైపు హైదరాబాదీ ప్లేయర్ కశ్యప్ కూడా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తనదైన ముద్రవేశాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు పలు టోర్నీల్లో భారత్‌కు పతకాలు సాధించి పెట్టాడు. మరో విశేషమేంటంటే సైనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇవాళ విడుదలైంది. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది.

Leave a Comment