‘బైలంపుడి’ చిత్ర పోస్టర్ విడుదల చేసిన నిర్మాత బ్రంహనంద రెడ్డి గారు.  

 

హైద్రాబాద్ న్యూస్ ➤ తార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ బ్రంహనంద రెడ్డి నిర్మిస్తున్న చిత్రం  ‘బైలంపుడి’. ఒక చక్కటి గ్రామీణ నేపథ్యంలో స్టోరీ ఓరియెంటెడ్ గా ఉండబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాత బ్రంహనంద రెడ్డి గారు  హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో పత్రికా  విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్  వైజాగ్ దగ్గర చోడవరం పరిసర ప్రాంతాలలో  శరవేగంగా జరుగుతోంది , ఈ  కథకు స్టోరీ , స్క్రీన్ ప్లే , దర్శకత్వ బాధ్యతలను  అనిల్  పి జి  రాజ్ చేస్తున్నారు.

హరీష్ వినయ్ హీరోగా నూతన పరిచయంతో వస్తుండగా, శరణం గచ్ఛామి ఫేమ్ తనిష్క తివారి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది.

నిర్మాత శ్రీ బ్రంహనంద రెడ్డి గారు మాట్లాడుతూ , తెలుగు చిత్ర సీమలో కథా బలంతో వచ్చిన ఎన్నో చిత్రాలు ఎంతో ఘన విజయాన్ని సాధించాయి, అటువంటి చిత్రాలు ఆదరించడంలో ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అటువంటి వినూత్న కథనంతో మేము ప్రేక్షకులముందుకు వస్తున్నామని నమ్మకంగా చెప్పగలుగుతున్నామని పేర్కొన్నారు . ఈ చిత్రంలో అందరూ నూతన నటీ నటులైనప్పటికీ అంకిత భావంతో ఈ చిత్రంలో నటించారని తెలిపారు . అత్యుత్తమ స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఉద్ఘాటించారు. “ఇక్కడ యుద్ధం చేయాలి … గెలడానికి కాదు బ్రతకడానికి ” అనే ప్రత్యేక కాప్షన్ తో ఈ చిత్రం ఆద్యంతం కొనసాగుతున్నదని పేర్కొన్నారు .

స్పెషల్ అపీరియన్స్ గా విచ్చేసిన ‘మిస్ ఫేమ్ ఇండియా 2018’ రన్నర్ రప్ మిస్ షాలు సోని మాట్లాడుతూ విన్నూత్న కథ మరియు కధనం తో వస్తున్న ఈ ప్రయోగాత్మ చిత్ర పోస్టర్ విడుదలయ్యినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

‘బైలంపుడి’ చిత్ర  ప్రమోటర్ శ్రీ శ్రీనివాస్ శరకడం ఈ సంధర్భంగా మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని డాన్స్ కొరియో గ్రాఫర్లకు ఈ సినిమాకు చెందిన ఒక ప్రత్యేక గీతం యొక్క కాంటెస్ట్ ను వచ్చే సోమవారం నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ కాంటెస్ట్ విజేతలకు నగదు బహుమతితో పాటుగా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కొరియోగ్రఫీ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీ బ్రంహనంద రెడ్డి గారు ‘బైలంపుడి’ చిత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు .

బైలంపుడి’ చిత్ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు : నిర్మాత – శ్రీ బ్రంహనంద రెడ్డి గారు, స్టోరీ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం – అనిల్  పిజి  రాజ్ , మ్యూజిక్ – సుభాష్ ఆనంద్ , స్క్రిప్ట్ డెవలప్మెంట్ అండ్ డైలాగ్స్ – సాయి, ఎడిటర్ – జానకిరామ్ , ఫైట్ మాస్టర్ – కృష్ణమ్ రాజ్ , ఆర్ట్ డైరెక్టర్ – ఉత్తమ్ కుమార్ సూరిశెట్టి , డాన్స్ – గోరా , లిరిక్స్ -రామారావు , డోప్ – అనిల్ కుమార్ పల్లా

Leave a Comment