తెలుగు న్యూస్ టుడే ➤ మన చిన్నారులను భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ ఇంద్రధనుష్ టీకా పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమవుతోంది. 2016 ఏప్రిల్ 25 తర్వాత పుట్టిన పిల్లలకు టీకా వేయనున్నారు. జిల్లాలో 1656 మంది చిన్నారులను గుర్తించిన వైద్యారోగ్యశాఖ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలియో మీద అనేక వదంతులు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే , అటువంటి అపోహలు ప్రజలు నమ్మవద్దని అధికారులు తెలిపారు.
పిల్లలు పోలియో, మెదడువాపు వ్యాధి, హైపటీ్‌స-బీ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ ద్వారా టీకా పంపిణీ చేపడుతోంది. చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, కల్వకుర్తి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజక వర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు సర్వే నిర్వహించి 1656 పిల్లలను గుర్తించారు. జిల్లాలో 250 మంది ఎఎన్‌ఎంలు, 66 మంది సూపర్ వైజర్లు, 40 మంది డాక్టర్లు టీకా పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సర్వేలో గుర్తించిన పిల్లలకు రెండు విడతల్లో టీకాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 22 నుంచి 27 వరకు, వచ్చే నెల 5 నుంచి 16 వరకు టీకాలు ఇవ్వనున్నారు.
హెచ్‌పీబీ, బీసీజీ టీకా : పుట్టిన వెంటనే శిశువుకు ఎలాంటి వ్యాధులూ సోకకుండా హెచ్‌పీబీ, బీసీబీ టీకాలను పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ప్రతీ బుధ, శని వారాల్లో ఇస్తారు. 9 నెలల నుంచి 12 నెలల్లోపు పిల్లలకు మీజిల్స్, విటమిన్-ఎ టీకాలు, 6, 10, 14 వారాల పిల్లలకు వివిధ రకాల టీకాలు వేయడానికి జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Leave a Comment