తెలంగాణాలో రాహుల్ గాంధీ సభ నేడు

తెలుగు న్యూస్ టుడే ➤ భారత జాతీయ కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పర్యటన నేపథ్యంలో గ్రేటర్ నగరంలో శనివారం ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు.

తాజా షెడ్యూల్ ప్రకారం.. రాహుల్‌ ముందుగా నాందేడ్‌ నుంచి బైంసాకు వెళ్తారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు సభలో పాల్గొని కామారెడ్డి వెళ్తారు.  అక్కడ జరిగే బహిరంగ సభలో 2.30 నుంచి 3 గంటల వరకు పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుని సాయంత్రం చార్మినార్‌ వద్ద జరిగే రాజీవ్‌ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. 7 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. మళ్లీ 27న జరిగే కాంగ్రెస్ ప్రచార సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు చార్మినార్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు ఎస్పీ జీ రక్షణ కలిగి ఉన్నరాహుల్‌గాంధీ హాజరువుతున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో గంట ఆలస్యంగా అనగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాదారులు ఆయా రూట్లలో ప్రత్యామ్నాయ రూట్ల లో వెళ్లి, ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.

సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల మధ్య హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లై ఓవర్ , సీఎం క్యాంప్ అఫీస్ మోన్నప్ప జంక్షన్, రాజ్‌భవన్, వీవీ విగ్రహాగం, రవీంధ్రభారతి, బీజేఆర్ విగ్రహాం, అబిడ్స్, మోహింజా మార్కె ట్, అఫ్జల్‌గంజ్, మదీనా, మూసాబౌలి, మోతీగల్లీ, లాడ్‌బజార్, చార్మినార్ వరకు ఆంక్షలు ఉంటాయి.
రాత్రి 7 గంటల నుంచి 7.40 నిమిషాల వరకు చార్మినార్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ఆంక్షలు ఉంటాయి.
ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుండడంతో సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆయా రూట్లలో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

Leave a Comment