దేవదాస్ పార్టీకి రెడీ !

తెలుగు న్యూస్ టుడే ➤ కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం దేవదాస్‌. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి మంచి స్పంద‌న ల‌భించింది. త్వ‌ర‌లో ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేసి సినిమాపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించాలని టీం భావిస్తుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌ర‌చిన సంగీతంకి మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన వ‌స్తుంది. చిత్రం నుండి ఒక్కొక్క‌టిగా లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేస్తున్న టీం తాజాగా ఏమో ఏమో ఏమో అనే సాంగ్ విడుద‌ల చేసారు. సిరివెన్నెల సీతారామ‌ శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా సిద్ శ్రీరామ్ , ర‌మ్య బెహ్ర క‌లిసి పాడారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఆక‌ట్టుకుంటుంది.

నేడు జ‌ర‌గ‌నున్న‌ ఆడియో వేడుక‌లో మిగ‌తా సాంగ్స్ విడుద‌ల చేయ‌నున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు. సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు.

Leave a Comment