హింసాత్మక దృశ్యాలు ప్రసారం చేయొద్దు !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యల పేరుతోప్రసార మాధ్యమాల్లో కథనాలు ప్రసారం చేయవద్దని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ఇతరులను ప్రేరేపించేలా హింసాత్మక దృశ్యాలు ప్రసారం చేయడం సరికాదన్నారు. పదేపదే హింసాత్మక దృశ్యాల ప్రసారం కేబుల్ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.

ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, అటు తర్వాత హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో నవదంపతులపై యువతి తండ్రి దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం స్పష్టించిన సంగతి తెలిసిందే.

Leave a Comment