ఎలైట్ క్రికెట్ అకాడమీ ఉచిత శిక్షణ

 

తెలుగు న్యూస్ టుడే ➤ హైదరాబాద్, మాదాపూర్‌లోని ఎలైట్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ భరణి తెలిపారు. దసరా సెలవులు సందర్భంగా క్రికెట్ ఆసక్తి కలిగిన యువకులకు ఈ నెల 12 నుంచి 21వ తేదీవరకు శిక్షణ కార్యక్రమం అందిస్తామన్నారు. పదిరోజుల పాటు సాగే ఈ శిక్షణ శిబిరంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి ఆటగాళ్లతో శిక్షణను ఉచితంగా ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటి నుంచి ఎంట్రీలను స్వీకరిస్తామని, రిజిస్ట్రేషన్ కోసం (9618444555,9154495650) నంబర్లను సంప్రదించాలని కోరారు.

Leave a Comment