మెరుపు సమ్మె చేపట్టిన జూనియర్‌ డాక్టర్లు !

తెలుగు న్యూస్ టుడే ➤ తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ డాక్లర్లు మెరుపు సమ్మెకు దిగారు. జూనియర్ డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకొని రెండు నెలలు కావొస్తున్నాఇంకా కేసులో విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శిల్ప ఆత్మహత్య అంశంపై సీఐడీ విచారణ జరిపి.. నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. శిల్ప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం అత్యవసరంగా భేటీ అయిన జూడాలు 24 గంటలపాటు మెరుపు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.

Leave a Comment