యువ తేజాలతో ఫోర్బ్స్ తొలి జాబితాలో ఉపసాన !

తెలుగు న్యూస్ టుడే ➤ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ‘’టైకూన్స్ ఆఫ్ టుమారో’’ పేరిట తొలిసారిగా రిలీజ్ చేసిన జాబితాలో స్టార్ షట్లర్, ఒలింపిక్ మెడల్ విన్నర్.. పివి.సింధు, అపోల్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ ఉపాసన కామినేని చోటు సాధించారు. బిజినెస్,మూవీ,స్పోర్ట్స్ రంగాల్లో ఘనత సాధించిన 22 మందిని ఈ లిస్ట్ కు ఎంపిక చేశారు. క్రీడా రంగం నుంచి పివి.సింధు మాత్రమే ఈ జాబితాలో చోటు సాధించడం విశేషం. ముంబైలో ఇవాళ(సెప్టెంబర్.25)న జరిగే కార్యక్రమంలో వీరిని సన్మానించనున్నారు.

ఇక ఈ జాబితాలో ఏపీసెజ్ సీఈవో కరణ్ అదానీ, ఫ్యూచర్ కన్జ్యూమర్ ఎండీ అశ్నీ బియానీ తదితరులకూ స్థానం లభించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా, కుమార మంగళం బిర్లా కూతురు, స్వతంత్ర మైక్రోఫైనాన్స్ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా కూడా ఉన్నారు. యెస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్ కూతురు, ది త్రీ సిస్టర్స్ ఇనిస్టిట్యూషనల్ ఆఫీస్ వ్యవస్థాపకురాలైన రాధా కపూర్ ఖన్నా, ఐడీ ఫ్రెష్ ఫుడ్ సహవ్యవస్థాపకుడు పీసీ ముస్తఫా, ఫ్రెష్‌వర్క్స్ వ్యవస్థాపకుడు గిరీష్ మాత్రుబూతం, జెరోధా సహవ్యవస్థాపకులు నిఖిల్ కామత్-నితిన్ కామత్, క్లియర్‌ట్యాక్స్ వ్యవస్థాకుడు ఆర్చిత్ గుప్తా, మాసివ్ రెస్టారెంట్స్ వ్యవస్థాపకుడు జోరోవార్ కల్రా, బిర్లా 91 బీర్ వ్యవస్థాపకుడు అంకుర్ జైన్, అమీరా షా (మెట్రోపొలిస్ హెల్త్‌కేర్), సిద్ధార్థ్ బింద్రా (బీబా అప్పారెల్), అనంత్ గోయెంకా (సియట్), విక్రమ్ ష్రాఫ్ (యూపీఎల్), అభిషేక్ లోధా (లోధా గ్రూప్), రితేష్ అగర్వాల్ (ఓయో రూమ్స్), నదియా చౌహాన్ (పార్లే అగ్రో)లూ చోటు దక్కించుకున్నారు. వీరితోపాటు బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు, నటులు విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ ఉన్నారు. వారివారి వ్యక్తిగత సంపద ఆధారంగానే ఈ జాబితా రూపొందలేదన్న ఫోర్బ్స్.. కుటుంబ వ్యాపారాల వారసత్వానికి, పారిశ్రామికవేత్తల తొలి తరానికి ఈ జాబితా అద్దం పడుతున్నదన్నది.

Leave a Comment