ఆంధ్రా డీఎస్సీ నోటిఫికేషన్‌కు మోక్షం !

 

తెలుగు న్యూస్ టుడే ➤ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎదురుచూపులనంతరం మోక్షం లభించింది. ఎన్నికల తరుణంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ని ప్రకటించింది. మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ‘ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేస్తాము. నవంబర్‌ 30న పరీక్ష నిర్వహించి.. వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాక ఈ రోజు జరిగే కేబినేట్‌ మీటింగ్‌లో పీఈటీ పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామ’ని వెల్లడించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీచేయడంతో జులైలో వెలువడాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Leave a Comment