హై కోర్ట్ తీర్పుతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్రంలో 2016, నవంబర్ 11, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్-2 రాతపరీక్షల్లో సరిగా బబ్లింగ్ చేయని, వైట్‌నర్ ఉపయోగించిన వారిని మౌఖిక పరీక్షలకు(ఇంటర్వ్యూలకు) అనుమతించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చింది. వైట్‌నర్ వాడిన, డబుల్ బబ్లింగ్ ఉన్న సమాధాన పత్రాలు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో డబుల్ బబ్లింగ్ చేసి, వైట్‌నర్ వాడిన వారిని తొలగించి.. మిగతా వారికి ఇంటర్వ్యూ నిర్వహించడానికి కోర్టు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. 2016, సెప్టెంబర్‌లో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Leave a Comment