గ్రహాలతో మీ రాతలు మారతాయి ?

తెలుగు న్యూస్ టుడే ➤ మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా .. అయితే మీ సమస్యలు జ్యోతిష్యంతో పారిపోతాయ్ ..మీ భవిష్యత్‌ను బంగారుమయంగా తీర్చిదిద్దుతా.. ఆన్‌లైన్ పూజలతో వారంలో మీకు ఫలితం కనిపిస్తుంది.. మిగతా పూజలు చేయకుంటే గ్రహాలు తిరగబడతాయి.. జీవితం నాశనమవుతుంది.. అంటూ ఆస్ట్రాలజీ వెబ్‌సైట్ వేదికగా రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు బురిడి కొట్టించగా, గ్రేటర్ నగరానికి చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.13లక్షలు సమర్పించుకున్నాడు. అతని తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైం బృందం నిందితుడిని చాకచక్యంగా పట్టుకుంది. సదరు నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశారు.

రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు పూర్తి వివరాలు తెలిపారు. రామాంతపూర్ ప్రాంతానికి చెందిన జానకీ తన పెద్ద కుమారుడు వైవాహిక జీవితం, ఉద్యోగంలో పలు ఒడిదిడుకులు ఎదుర్కున్నాడు. కొద్దిరోజుల కిందట అతను ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఈ పరిణామాలతో బాధితుడు తీవ్రమై ఒత్తిడికి గురై, జ్యోతిష్యానికి సంబంధించిన  ఓ వెబ్‌సైట్‌లో తాను ఎదుర్కుంటున్న సమస్యలు, వాటి వల్ల మానసికంగా పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. ఆ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఆకాశ్ శర్మ అలియాస్ ఆకాశ్ భార్గవ తన జ్యోతిష్యశాస్త్రం ప్రావీణ్యంతో ప్రత్యేక పూజలు చేసి, పరిస్థితులను చక్కదిద్ది, గ్రహాలను అనుకూలంగా మార్చి మంచిగా చేస్తానని నమ్మించాడు. మొదట రూ.2 వేలు చెల్లిస్తే, వారం రోజుల్లో మంచి ఫలితం వచ్చేలా పూజ చేస్తానని చెప్పాడు. అలా తన ఉచ్చులోకి దింపిన ఆకాశ్ శర్మ పూజల పేరుతో నెల రోజుల్లో అతని వద్ద నుంచి రూ.13లక్షలు ఆన్‌లైన్‌లో వసూలు చేశాడు.

ఆకాశ్ శర్మ అడిగిన డబ్బులు ఇవ్వకపోతే తన పరిస్థితి దయనీయంగా మారి గందరగోళంలో పడుతుందనే ఒత్తిడిలో ఉండిపోయి ఇంకా నగదు చెల్లించడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితుడు తల్లి జానకీ, ఆగస్టు 21న రాచకొండ సై బర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు పై ఏసీపీ హరినాథ్ సారథ్యంలో ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్, ఎస్‌ఐ అనిల్ నేతృత్వంలోని సైబర్ క్రైం బృందం దర్యాప్తు చేసి, జలంధర్‌లో ఆకాశ్ ను అరెస్ట్ చేసి, గురువారం నగరానికి తెచ్చి రిమాండ్ చేశారు. ఈ కేసును చాకచక్యంగా విచారించిన సైబర్ క్రైం బాధితుడు పోగొట్టుకున్న రూ.13 లక్షలు రికవరీ చేసి, అతని వెంటపడ్డ దురదృష్టాన్ని తరిమికొట్టారు. ఈ వెబ్‌సైట్ల ను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని రాచకొండ పోలీసు లు సంబంధిత సంస్థలకు లేఖలు రాస్తున్నారు.

ఆకాశ్ శర్మ అలియాస్ ఆకాశ్ భార్గవ్(19) ఎనిమిది చదువును మధ్యలో వదిలేసి, ఖాళీ సమయంలో ఇం టర్నెట్‌పై ఆసక్తి పెంచుకుని మంచి పట్టు సాధించి అమాయకులను మాయ చేయాలని పథకం రచించాడు. దీని కోసం తన స్నేహితుడి సహాయాన్ని తీసుకుని 8 అస్ట్రాలజీ వెబ్‌సైట్‌ను రూపొందించి, చాలా మందిని ఆకట్టుకున్నాడు.

ఇలా ఈ వెబ్‌సైట్‌లో సంప్రదించిని వారికి తన మాయ మాటలతో వల వేసి, ప్రతీ సమస్య తీరుస్తాననీ, దానికి పూ జలు చేస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టాడు. అలా ఆన్‌లైన్‌లో తన తండ్రి ఖాతాలో డబ్బును జమ చేయించుకుని, పూజలు చేయకుండానే మంగళ, శుభ, శని పూజలు చేశానని వాట్సాప్‌లో పెట్టి అందర్నీ మాయలో పడేశాడు. ఇలా ఆకాశ్ ఓ దశలో అన్ని వర్గాలకు చెందిన వారి కోసం వెబ్‌సైట్లను రూపొందించి,ప్రపంచంలోనే అత్యంత పేరొందిన జ్యోతిష్యుడిగా తనకు తాను ముద్ర వేసుకున్నాడు. వెబ్ డిజైనర్ ద్వారా ఆసక్తికరంగా వెబ్‌సైట్లను తయారు చేసుకుని, ప్రతి రోజు 50మందిని బు రిడి కొట్టిస్తూ, అతని చిన్న వయస్సులోనే జ్యోతిష్కుడిగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూ లక్షలు సంపాదించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Leave a Comment