తెలుగు న్యూస్ టుడే ➤ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా మనదేశంలోనూ పలు రాష్ట్రాల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తోంది ఇస్రో. ఇవాళ(గురువారం) మొదలయ్యే ఈ వారోత్సవాలు ఈ నెల పదో తేదీ వరకు జరుగుతాయి. అసలు రాకెట్ ను ఎలా తయారుచేస్తారు.. రాకెట్ ను ఎలా ప్రయోగిస్తారు.. ఉపగ్రహాలు ఎలా ఉంటాయి.. ఇలాంటి అంతరిక్షానికి సంబంధించిన అంశాలు చాలామందికి ఆసక్తి కలిగిస్తాయి. ప్రజలు, విద్యార్థుల్లో విజ్ఞాన పరంగా మరింత అవగాహన పెంచేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్‌లోని ఓ ఆడిటోరియంలో… ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ వారోత్సవాలను ప్రారంభించారు. ఈసారి ఐదు రాష్ట్రాలల్లోని 13 పట్టణాల్లో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, అమలాపురం, విజయవాడ, తెనాలి, చిత్తూరు, సూళ్లూరుపేట, శ్రీహరికోట తోపాటు.. తెలంగాణలో కొత్తగూడెం లో వారోత్సవాలు జరుపుతున్నారు. తమిళనాడులోని పట్టుకొటై, కాంచీపురం.. కర్ణాటకలోని బళ్లారి, హోసూరు.. ఒడిశాలోని బాలాసోర్‌లో వారోత్సవాలు మొదలయ్యాయి. వారోత్సవాల్లో భాగంగా.. అంతరిక్ష ప్రయోగాల ప్రదర్శనలు, ఫిలిం షో, కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులు ఇస్తారు. శ్రీహరికోటలోని షార్ ను చూసేందుకు విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు.
శ్రీహరికోటలో అంతరిక్ష వారోత్సవాలు
Leave a Comment