దక్షిణమధ్య రైల్వే సంక్రాంతి రద్దీకి ఇక చెక్ !

తెలుగు న్యూస్ టుడే ➤తెలుగు పండుగ సంక్రాంతి హడావుడి మొదలైయింది. భాగ్య నగరం నుంచీ సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళ సంఖ్యా తక్కువేమీ ఉండదని తెలిసిన సంగతే . ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని… వివిధ మార్గాల్లో వందకు పైగా అదనపు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనల మేరకు 54 జనసాధారణ రైళ్లను అధికారులు పెంచారు.

సికింద్రాబాద్‌–విజయవాడ, సికింద్రాబాద్‌–తిరుపతి, తిరుపతి–కాకినాడ, విజయవాడ–విజయనగరం, విజయవాడ–హైదరాబాద్, తదితర మార్గాల్లో జనసాధారణ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్‌–విజయవాడ (07192/07193) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 11వ తేదీ నుంచీ , 20 వ తేదీ వరకు … ప్రతీ రోజు మధ్యాహ్నం 12 కు బయలుదేరి అదేరోజు సాయంత్రం 7.30 కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 8. 25 కు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.20 కి సికింద్రాబాద్‌కు, ఉదయం 3 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.

 

Leave a Comment