సిక్కి రెడ్డిని అభినందించిన కేటీఆర్ !

 

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఎన్ సిక్కిరెడ్డికి అర్జున అవార్డు రావడం తెలిసిందే, ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు మరియు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందించారు. గురువారం మసాబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను సిక్కిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆమెను మంత్రి అభినందించి శాలువా కప్పి సత్కరించారు. కెరీర్‌లో రాణించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి సారిగా అర్జున అవార్డు సాధించిన సిక్కి రెడ్డి..భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సిక్కిరెడ్డిని అభినందించి బతుకమ్మ జ్ఞాపికను అందజేశారు ఎంపీ కవిత . ఆమె విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులను ప్రశంసించారు. మోకాలి గాయంతో ఒక దశలో రాకెట్ పట్టలేని పరిస్థితిని ఆత్మవిశ్వాసంతో అధిగమించిన సిక్కిరెడ్డి క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కెరీర్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సిక్కిరెడ్డి తెలంగాణకే గర్వకారణమని కితాబిచ్చారు. అనంతరం

రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసిన సిక్కిరెడ్డి.. తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం తరఫున తొలి అర్జున అవార్డు సాధించిన సిక్కిరెడ్డిని .. ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు.

Leave a Comment