తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణాలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల హోరుతో వాడీ … వేడీ చర్చలతో ప్రతిపక్షాలు స్వపక్షాలు ఒకరిమీద ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు . ఇప్పటికే నేరుగా విమర్శలు చేసుకున్న వీరు ప్రస్తుతం సోషల్‌మీడియా వేదికగా పలు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి గతంలో బాబు చేసిన ట్వీట్లను తాజాగా కేటీఆర్ పోస్ట్ చేశారు. అవినీతి కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని గతంలో చంద్రబాబు చేసిన ట్వీట్లను కేటీఆర్ గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ పార్టీని ఇటాలియన్ మాఫియా రాజ్‌తో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడదే ఇటాలియన్ మాఫియా రాజ్‌తో ఎలా జతకట్టారని విమర్శించారు. అందుకే అది మహాకూటమి కాదు.. మహాఘటియా బంధన్ అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం వల్లే 2004లో కాంగ్రెస్‌తో.. 2009లో టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకుందని వివరించారు. టీడీపీ-కాంగ్రెస్ మాత్రం అవకాశవాదం.. అధికార దాహంతోనే ఒక్కటయ్యాయని మండిపడ్డారు.
So the “Italian Mafia Raj” (as described below) has new friends now. Guess who it is ?
Now you know why I call it #MahaGhatiyaBandhan pic.twitter.com/RQQCOueTd7
— KTR (@KTRTRS) October 9, 2018