ఈ నెల27న మగ్గం తెలంగాణ వస్త్ర ప్రదర్శన !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ చేనేత కళాకారులకు ప్రోత్సాహకాన్ని అందించడానికి ప్రభుత్వం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో ఈ నెల27న మగ్గం తెలంగాణ వస్త్ర ప్రదర్శన జరుగనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ ఎం.రాజమహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ చేనేత కార్పొరేట్, అత్యాధునిక ఫ్యాషన్లకు అనుగుణంగా తెలంగాణ చేనేత కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న అనేక ఉత్పత్తులను ప్రపంచానికి చాటేందుకు ఈ వస్త్ర ప్రదర్శన ఉండనుందన్నారు. ఈ ప్రదర్శనలో పలువురు మోడళ్లు ఈ వస్త్రాలు ధరించి ర్యాంప్‌వాక్ చేయనున్నారు. గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని చేనేత వస్త్రాల తయారీ దారులకు చేయూతనందించే ఉద్దేశంతో సీబీఎండీ సంస్థ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 27న సాయంత్రం 5 గంటలకు ఎన్ కన్వెన్షన్‌లో జరిగే ఈ మగ్గం.. తెలంగాణ వస్త్ర షోకు కేంద్ర మంత్రులు చేనేత జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరాని, మరో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌లు హాజరు కానున్నారు. ఆధునిక ట్రెండ్లు, ఫ్యాషన్లకు అనుగుణంగా తెలంగాణ చేనేత కళాకారులు ఏ విధంగా ఆధునిక డిజైన్లను రూపొందిస్తున్నారనే విషయం ప్రపంచానికి చాటేలా ఈ ప్రదర్శన ఉంటుందని ప్రోగ్రాం నిర్వాహకులు తెలిపారు.

Leave a Comment