క్రికెట్ గ్రౌండ్ లోకి దూసుకొచ్చి ముద్దివ్వబోయిన అభిమాని !

తెలుగు న్యూస్ టుడే ➤సినీ, రాజకీయ , క్రికెట్ ప్రముఖులకు అభిమానులతో ఎప్పుడోకప్పుడు విచిత్ర అనుభవాలు ఎదురవుతూవుంటాయి . ప్రత్యేకంగా క్రికెట్ ఆటగాళ్లకు వారి అభిమానులనుంచీ వచ్చే అభిమానానికి హద్దులుండవంటే అతిశయోక్తి కాదు. ఉప్పల్ స్టేడియంలో ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భద్రతా వలయాన్ని చేందించుకోని ఓ యువకుడు మైదానంలోకి ప్రవేశించాడు. అనంతరం కోహ్లికి దగ్గరకు వెళ్లి ముద్దు ఇవ్వబోయాడు. దీంతో ఆ యువకుడిపై కోహ్లీ కొంత అసహనం వ్యక్తం చేశాడు. చివరకు అతనితో సెల్ఫీ దిగి అక్కడ నుంచి పంపించాడు. ఉప్పల్ పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కోహ్లీ మీద అభిమానంతోనే మైదానంలోకి వెళ్లినట్లు పేర్కొన్నాడు. అతన్ని కడప జిల్లాకు చెందిన అహ్మద్‌ఖాన్‌గా పోలీసులు గుర్తించారు.

Leave a Comment