మెగా ఫ్యామిలీ హారర్ స్టోరీ

తెలుగు న్యూస్ టుడే ➤మెగా ఫ్యామిలీ అంతా ఒకే సారి దెయ్యాలుగా మారిపోయారు , ఏమిటీ ఇదంతా అనుకుంటున్నారా … మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో క‌న‌ప‌డ‌డం చాలా అరుదు. కాని తాజాగా హాలోవీన్ గెట‌ప్స్ వేసుకొని గ్రూప్ ఫోటో దిగారు మెగా కుటుంబ స‌భ్యులు.

అసలు హాలోవీన్ అనగా చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు దెయ్యాలు, భూతాల గెటప్ లు వేసుకొని అందరిని అలరిస్తుంటారు. ఇటు యూకే లోను.. అటు అమెరికాలోను అక్టోబర్ 31 సాయంత్రం హాలోవీన్ ఈవెనింగ్ గా జరుపుకోవడం తరతరాల నుండి వస్తోంది. అక్కడి ఆచార వ్యవహారాలను మన వాళ్ళను కూడా పాటిస్తూ ఈ హాలోవీన్ డేని సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీ ఫ్యామిలీస్ కూడా ఈ డేపై కొంత‌ ప్రత్యేక శ్రద్ద పెడుతూ వ‌స్తున్నారు. 2016లో మెగా ఫ్యామిలీకి సంబంధించి వరుణ్ తేజ్, నిహారికలు దెయ్యాల గెటప్ లో కనిపించగా అల్లు అర్జున్ తనయుడు అయాన్ బ్యాట్ మాన్ గెటప్ లో కనిపించి సందడి చేశాడు. గ‌త ఏడాది వ‌రుణ్ తేజ్ దెయ్యం గెట‌ప్‌లోకి మారి సంద‌డి చేశాడు. ఈ సారి మెగా ఫ్యామిలీ మొత్తం హాలోవీన్‌ని స‌ర‌దాగా సెల‌బ్రేట్ చేసుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ , ఉపాస‌న‌, సాయిధ‌ర‌మ్‌, శ్రీజ‌, సుస్మిత‌తో పాటు ప‌లువురు కుటుంబ స‌భ్యులు హాలోవీన్ కాస్ట్యూమ్స్‌లో మెరిసారు. వీరిని చూసిన అభిమానులు కాస్త థ్రిల్ ఫీల‌వుతున్నారు. కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో హాలోవీన్ సంద‌డి జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Comment