తెలుగు న్యూస్ టుడే ➤ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తారో అందరికీ తెలిసినదే , తాజాగా కోడలు ఉపాసన తన ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్‌లో తెలియజేస్తూ ఫోటో షేర్ చేసింది. చిరు తన 151వ చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సైరా సరసింహరెడ్డి. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం ఆసియా బోర్డర్ జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. 40రోజుల పాటు ఈ దేశంలో షూటింగ్ ప్లాన్ చేయగా, కొద్ది రోజుల తర్వాత భారీ వార్ సీక్వెన్స్ ఎపిసోడ్‌ని తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఈ ఎపిసోడ్ కోసం 300 గుర్రాలు,150 మంది జూనియర్ ఆర్టిస్ట్స్‌తో పాటు కొంత మంది సీనియర్ స్టార్స్ జార్జియా వెళ్లనున్నట్టు సమాచారం. ప్రధాన పాత్ర పోషిస్తున్న చిరు కూడా రెండు మూడు రోజులలో జార్జియాకి వెళ్ళనున్నాడు. ఈ క్రమంలో ఓసారి రామ్ చరణ్ మూవీ సెట్‌ని విజట్ చేశారు మెగాస్టార్. ఆ తర్వాత చిరు, ఉపాసన, రామ్ చరణ్, సుస్మిత బ్లాక్ డ్రెస్ ధరించి డిన్నర్‌కి వెళ్ళారు. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న మెగా ఫ్యామిలీని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ ఫొటోతో ఫ్యాన్స్ లో వైరల్ అయి కూర్చుంది.
మెగా ఫ్యామిలీ డ్రెస్ కోడ్ !
Leave a Comment