నాగబాబు వెస్ బాలకృష్ణ … ఇకనైనా ఆగేనా !

తెలుగు న్యూస్ టుడే ➤ వివాదం ముగిసిందంటూనే బాలకృష్ణకు మరో వార్నింగ్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు.ఇకనైనా రియలైజ్ అయి గమ్మునుంటే ఓకె అని.. లేదూ మళ్లీ వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం మరోసారి మీ జోలికి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైతే బాలకృష్ణతో వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ బయోపిక్ హడావుడి మొదలై నాటి నుంచి సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణను టార్గెట్ చేస్తూ వస్తున్న నాగబాబు.. బాలకృష్ణ గతంలో చేసిన విమర్శకు ‘ఆరో కౌంటర్’ వీడియో రూపంలో సోషల్ మీడియాలో వదిలారు.

ఎప్పుడో బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు స్పందిస్తున్నారేంటి అని చాలామంది అడుగుతున్నారని నాగబాబు ప్రస్తావించారు. సంవత్సరం క్రితం మనల్ని కొట్టి పారిపోయినోడు ఏడాది తర్వాత కనిపిస్తే ఊరుకుంటామా? అని తనను ప్రశ్నిస్తున్నవాళ్లకు కౌంటర్ ఇచ్చారు. భరిస్తాం.. భరిస్తాం.. ఒళ్లు మండినప్పుడు మాత్రం ఇలాగే రియాక్ట్ అవుతాం అని చెప్పారు.

ఎవరి నాన్న వాళ్లకు నిజంగానే గొప్ప అని.. అలాగే మీ నాన్న కూడా మీకు గొప్ప అని బాలకృష్ణను ఉద్దేశించి అన్నారు. చిరంజీవి అంటే తమకు తండ్రి సమానుడు అని.. కాబట్టి మాకు ఆయన ఎప్పటికీ గొప్పే అని చెప్పారు. ఇక ఈ వివాదానికి తాను ఫుల్ స్టాప్ పెడుతున్నానని.. ఒకవేళ బాలకృష్ణ గారు దీన్ని కొనసాగించాలనుకుంటే ఆయన ఇష్టం అని అన్నారు. తనకు బాలకృష్ణ అంటే గౌరవమేనని, అయితే హద్దులు దాటి మాట్లాడటం మంచిది కాదని సున్నితంగా హెచ్చరించారు. మెగా అభిమానులు సైతం ఎవరూ భావోద్వేగపూరితంగా రియాక్ట్ కావద్దని.. ఇతర హీరోల అభిమానులను కూడా గౌరవించాలని చెప్పారు. మొత్తం మీద ఇంత పెద్ద వివాదం తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు నాగబాబు ప్రకటించడంతో.. నందమూరి ఫ్యాన్స్ నుంచి దీనికి ఎలాంటి కౌంటర్ ఉండబోతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Comment