నెల్లూరు రొట్టెల పండుగ ప్రారంభం !

 

హైద్రాబాద్ న్యూస్ ➤ మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు పట్టణంలో బారాషాహీద్ రొట్టెల పండుగ ప్రారంభమైంది. దేశంలోని పలు ప్రాంతాలనుంచి జనం రొట్టెలతో నెల్లూరుకు చేరుకుంటున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలను వదులుతున్నారు. నీళ్లలో ముంచిన రొట్టె తింటే కోరుకున్నది జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ పండుగ ఐదు రోజుల పాటు జరగనుంది.
సంతానం కోసం ఒకరు, సౌభాగ్యం కోసం మరొకరు, ఉద్యోగం, ఉపాధి ఇలా కోరిక ఏదైనా ఒక రొట్టెతో తీరిపోతుందని భక్తుల నమ్మకం. అందుకే దేశవిదేశాల నుంచి కూడా భక్తులు బారాషాహీద్ గ్రౌండ్‌కు వస్తుంటారు. భక్తుల రాకతో నెల్లూరు పట్టణం సందడిగా మారింది.

రొట్టెల పండుగకు ముందుగా భక్తులు దర్గాను సందర్శించి స్వర్ణాల చెరువులో రొట్టెలను వదులుతారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Leave a Comment