ఎన్టీఆర్…అరవింద సమేత మేకింగ్ వీడియో

తెలుగు న్యూస్ టుడే ➤ ఇప్పుడందరి దృష్టి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో చిత్రం అరవింద సమేత మీదే. ఎన్టీఆర్ తెరపై రౌద్రం ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు. అటు త్రివిక్రమ్ శైలి.. ఎన్టీఆర్ వాడి కలిస్తే ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. ఇటీవలే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్బంగా విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

తాజాగా అరవింద సమేత చిత్రానికి మరింత హైప్ తెచ్చేలా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ తనయుడు అభయ్.. తండ్రి పట్టిన కత్తి పట్టి త్రివిక్రమ్ ఒడిలో కూర్చొని ‘స్టార్ట్ కెమెరా’ అంటూ పలకడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా అభయ్ రామ్ సెట్స్ కు వచ్చినట్టు కనిపిస్తోంది.ఈ మేకింగ్ వీడియోలో త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ – హీరోయిన్ పూజా హెగ్డేకు సీన్లు వివరిస్తున్నట్టు చూపించారు. నాగబాబుతో మాట్లాడే సీన్లు కూడా చూపించారు. ఇందులో నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇక చివర్లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సాదాసీదాగా రోడ్డు పక్కన కూర్చొని ముచ్చట్లలో మునిగిపోయారు.

Leave a Comment