అరవింద సమేత ఎమోష‌న‌ల్ సాంగ్ ఏడ పోయిండో… ?

తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ టైగర్ జానియ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్నయాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అర‌వింద స‌మేత‌. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో చిత్రం తెర‌కెక్కుతుంది. థ‌మ‌న్ చిత్రానికి బాణీలు స‌మ‌కూర్చారు. చిత్రంలో కేవ‌లం నాలుగు పాటలు మాత్ర‌మే ఉండ‌గా, ఇటీవ‌ల యూ ట్యూబ్‌లో వాటిని విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. రీసెంట్‌గా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, పెంచ‌ల్ దాసిన లిరిక్స్ అందించిన ఎమోష‌న‌ల్ సాంగ్ ఏడ పోయిండో విడుద‌ల అయింది. శ్రీవ‌ల్లి, కైలాష్ కేర్‌, పెంచ‌ల్ దాస్ పాడిన ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎన్టీఆర్ ఖాతాలో మ‌రో హిట్ చేరేలా చేస్తుంద‌ని అంటున్నారు.

Leave a Comment