ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..
కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..
జనవరి 9 న #NTRకథానాయకుడు #NTRKathanayakuduOnJan9 pic.twitter.com/ayrh4i7Gu4— Krish Jagarlamudi (@DirKrish) October 4, 2018
తెలుగు న్యూస్ టుడే ➤ టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ లదే ట్రెండ్ . ‘మహానటి’ ఘన విజయం ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా మొదలైంది. దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇప్పటి వరకూ ‘యన్.టి.ఆర్’ అనే టైటిల్ ను పెట్టిన దర్శక నిర్మాతలు తాజాగా ఆ పేరును మార్చారు. టైటిల్‌ను ఎన్టీఆర్ కథానాయకుడిగా మార్చడాన్ని బట్టి రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు ఎన్టీఆర్ జానపద చిత్రాలు చేస్తున్న వేళ, ఎలా ఉంటాడో చూపుతూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్ మీద యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ గెటప్‌లో బాలయ్య కనిపిస్తున్నారు.
బాలయ్యబాబు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ క్రిష్ తెలిపాడు. ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు.. జనవరి 9న యన్.టి.ఆర్ కథనాయకుడు వస్తున్నాడని డైరెక్టర్ క్రిష్ ట్వీట్ చేశాడు. విద్యాబాలన్, సుమంత్, రానా వంటి వారు నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.