ఎన్టీఆర్ కథానాయకుడు … మహానాయకుడు !

తెలుగు న్యూస్ టుడే ➤ నటరస సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జీవిత కథాంశంతో బాలకృష్ణ ప్రధాన పాత్రతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను చిత్రయూనిట్ అందించింది. ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు.

బయోపిక్ మొదటి భాగానికి కథానాయకుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా..రెండో భాగానికి మహానాయకుడు అనే పేరు ఖరారు చేసినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అంతేకాకుండా రెండు చిత్రాల విడుదల తేదీలను కూడా ప్రకటించారు. కథానాయకుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనుండగా..మహానాయకుడు సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలతో కూడిన పోస్టర్లను క్రిష్ అండ్ టీం విడుదల చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు టైటిళ్లను గమనిస్తే మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నట్లుగా తెలుస్తోంది.

Leave a Comment