తెలుగు న్యూస్ టుడే ➤ శంకర్ రోబో చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘2.ఓ’. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం సీజీ వర్క్స్ జరుపుకుంటోంది. ఊహకందని గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూపించనున్నారనే టాక్ రావటంతో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మరోవైపు ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేసేలా ఇప్పటికే మేకింగ్ వీడియోలు, టీజర్ బయటకు వదిలిన చిత్రయూనిట్.. తాజాగా లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి 2 . ఓ సందడి షురూ చేశారు.
ఈ సాంగ్స్ లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే.. చిత్ర యూనిట్ ఏ రేంజ్ లో కష్టపడి ఉంటుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సాంగ్స్ సోషల్ మీడియా ట్రెండ్ గా హంగామా చేస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా 450 కోట్ల భారీ బడ్జెట్తో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకులముందుకు రానుంది.