తెలుగు న్యూస్ టుడే ➤ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న విడుదల కానుంది. మొదటి విభాగానికి ‘కథానాయకుడు’ అని, రెండో విభాగానికి ‘మహానాయకుడు’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా, దివగంత నటి శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుంది. అనేక టెస్ట్‌లు పూర్తైన తర్వాత రకుల్ ని శ్రీదేవి పాత్రకి ఫైనల్ చేశారు. తాజాగా రకుల్ బర్త్‌డే సందర్భంగా శ్రీదేవి పాత్ర పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇది ఇటు శ్రీదేవి అభిమానులకి, అటు రకుల్ అభిమానులకి ఆనందాన్ని ఇస్తుంది. కోట్ల మంది ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి పాత్రని పోషించడం కత్తిమీద సాము వంటింది. దీనికి న్యాయం చేయగలనని భావిస్తున్నాను. నాపై నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని రకుల్ చెప్పుకొచ్చింది. గతంలో ఎప్పుడు శ్రీదేవిని కలవని తాను సినిమాలని చూసి ఆమె హావభావాలు పలికించేందుకు ప్రయత్నాస్తాను. శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన వారిని కలిసి అన్ని విషయాలని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను అని రకుల్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణా జిల్లా దివి సీమీలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది.
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తుంది. ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తుండగా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు అని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.