ఎనర్జిటిక్ రామ్‌ హలో గురూ ప్రేమకోసమే ట్రైలర్

తెలుగు న్యూస్ టుడే ➤ ఎనర్జిటిక్ యంగ్ హీరో ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత .. హలో గురూ ప్రేమకోసమే అంటూ మన ముందుకు వస్తున్నారు. రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్నారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 18న రిలీజ్ చేస్తున్నారు.

ప్రమోషన్‌ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్రయూనిట్ ఆడియోను కూడా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశారు. తాజాగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. రామ్ ఎనర్జీ, అనుపమా, ప్రణీతల క్యూట్‌ పర్ఫామెన్స్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమాలో ప్రకాష్‌రాజ్‌లు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Comment