ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ లో రంగారెడ్డి రైడర్స్‌ !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్రం తరపున ప్రతీ సంవత్సరం నిర్వహించే తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌లో రంగారెడ్డి రైడర్స్‌ జట్టు ఆకట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చివర క్షణాల్లో విజృంభించిన రంగారెడ్డి రైడర్స్‌ 26-19తో హైదరాబాద్‌ బుల్స్‌పై విజయం సాధించింది.

మ్యాచ్‌ ఆరంభం నుంచి సమానంగా పోరాడినప్పటికీ రంగారెడ్డి తొలి అర్ధభాగాన్ని 13–10తో ముగించింది. చివరి వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించి గెలుపును అందుకుంది. విజేత జట్టు తరఫున పి. అన్వేశ్‌ ‘బెస్ట్‌ రైడర్‌’ అవార్డును అందుకున్నాడు.

Leave a Comment