బోల్డ్ ప్రశ్నలతో సద్గురుతో రౌడీ భేటీ !

తెలుగు న్యూస్ టుడే ➤ గీత గోవిందం చిత్రంతో కలెక్షన్ జోరు మీదున్న విజయ్ దేవరకొండ, ఎవ్వరికీ ఒకపట్టాన తను చేసే పనుల ద్వారా అర్థం చేసుకునే అవకాశం అవతలివాళ్ళకు ఇవ్వడు. యాటిట్యూడ్ కు సంబంధించి తన అభిమానులకు ఓ రోల్ మోడల్ లా మారిన ఈ క్రేజీ యూత్ హీరో తాజాగా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమానో లేదా స్పోర్ట్స్ రంగానికి చెందిన సెలబ్రిటీనో ఇంటర్వ్యూ చేస్తే అందులో పెద్ద విశేషం ఉండేది కాదు. పైగా అది అందరూ చేసేదే. ఇక్కడే విజయ్ దేవరకొండ డిఫరెంట్ గా ఆలోచించాడు. యూత్ అండ్ ట్రూత్ అనే కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు సద్గురుతో ముఖాముఖీ చేయటంతో అందరికి సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దీని గురించి విజయ్ కొద్దిరోజుల క్రితమే తన అభిమానులకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు. ఎవరైనా ప్రశ్నలు అడగదల్చుకుంటే మొహమాటపడకుండా తనకు పంపిస్తే మంచివి సెలెక్ట్ చేసుకుని నేరుగా నేనే అడుగుతానని చెప్పాడు. అంతే కాదు ఉత్తమమైన పది ప్రశ్నలు పంపిన వాళ్ళను తనతో పాటు తీసుకెళ్తానని కూడా చెప్పాడు. అది చేసాడో లేదో తెలియదు కానీ నిజాయితీగా అడుగుతాను అని చెప్పిన విజయ్ దేవరకొండ తన పనైతే పూర్తి చేసాడు. ఇందులో చాలా బోల్డ్ గా ప్రశ్నలు అడిగినట్టు టాక్. ఒకపక్క యువతలో ఆధ్యాత్మిక చింతన పూర్తిగా తగ్గిపోయి స్పిరుచువాలిటీ తమకు సంబంధం లేని విషయంగా భావిస్తాన్న ట్రెండ్ లో విజయ్ దేవరకొండ చేసిన ఈ ఇంటర్వ్యూ సం థింగ్ స్పెషల్ గా నిలవడం ఖాయం అనిపిస్తోంది.

Leave a Comment