తెలుగు న్యూస్ టుడే ➤ బిగ్‌బాస్ సీజన్ 2 అంత గొప్ప సక్సెస్ సాధించంటే దానికి కారణం కౌశలే. కౌశల్ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. . ఆయన పేరుతో ఆర్మీ ఏర్పడటం. అది రోజురోజుకూ భారీగా పెరిగిపోయి.. చివరకు ‘బిగ్‌బాస్’ను శాసించేసింది. కౌశల్‌కి వ్యతిరేకంగా హౌస్‌లో ఎవరు ప్రవర్తించినా వారిని ట్రోల్ చేయడం ఈ ఆర్మీ చేసింది. అయితే కౌశల్ భార్య నీలిమ కూడా గతంలో ఓ వీడియో సందేశం ద్వారా కంటెస్టెంట్స్ ఎవరినీ ట్రోల్ చేయొద్దని కోరారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
కౌశల్‌కి సామ్రాట్ ఓ రిక్వెస్ట్ చేశాడు. ‘‘కౌశల్ అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా నువ్వు కష్టపడుతున్నావు. నేను కూడా 11 ఏళ్లుగా కష్టపడుతున్నాను.
‘నీ కోరిక ప్రకారం సక్సెస్ అంతా నీ దగ్గరకు వస్తుంది’ అని నీకొక విష్ కూడా రాయడం జరిగింది. నీకు అంత అభిమానం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ప్లీజ్ మరోకోణం కూడా చూడు. అభిమానం పేరుతో మనతో ఇంట్లో(బిగ్‌బాస్ హౌస్) ఉన్న అమ్మాయిల్ని ట్రోల్ చేయడం జరుగుతోంది. అది కూడా గేమ్ అనుకుందాం. కానీ గేమ్ అయిపోయింది. ఇంత అభిమానంతో నీకు రెస్పాన్సిబులిటీ కూడా పెరిగింది. ఆ రెస్పాన్సిబులిటీతోనే ఆ ట్రోల్స్‌ని ఆపు’’ అంటూ సామ్రాట్ రిక్వెస్ట్ చేశాడు. మరి దీనిపై కౌశల్ ఎలా స్పందిస్తాడో … లేదంటే ఆ రిక్వెస్ట్ ని కూడా గేమ్ గానే ఫీల్ అవుతాడో వేచి చూడాలి.