సవ్య సాచి సుభద్రా పరిణయం ట్రైలర్

 

తెలుగు న్యూస్ టుడే ➤ చందూ మొండేటి, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం స‌వ్య‌సాచి. నవంబర్ 2 న (రేపు) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు మేక‌ర్స్. కొద్ది రోజులుగా చిత్రం నుండి సాంగ్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ కొద్దిసేప‌టి క్రితం సవ్య‌సాచి సుభ‌ద్ర ప‌రిణ‌యం పేరుతో కామెడీ ట్రైలర్ విడుద‌ల చేశారు. సుభద్రా పరిణయం నాటాకానికి సంబంధించిన ఈ ట్రైలర్ కడుపుబ్బా నవ్విస్తోంది. నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్‌ కృష్ణుడిగా క‌నిపించి అలరించాడు. హైపర్‌ ఆది, సుదర్శన్‌, విధ్యుల్లేఖ రామన్‌, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో న‌టించి కామెడీని పండించారు. భారీ అంచ‌నాల‌తో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా క‌థానాయిక‌గా నిధి అగర్వాల్ నటిస్తుంది. కీరవాణి సంగీతమందించారు. నాగార్జున న‌టించిన అల్ల‌రి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డు మీద చూసిన‌ట్టు సాంగ్‌ని ఈ సినిమా కోసం రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. నిన్న ఈ సాంగ్ ట్రైల‌ర్ విడుద‌ల కాగా ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది.

 

Leave a Comment