కొండాపుర్ లో షీ టీం భరోసా సెంటర్ ప్రారంభం

 

తెలుగు న్యూస్ టుడే ➤ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీం ఆధ్వర్యంలో.. భరోసా సెంటర్ ఏర్పాటైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దీనిని ప్రారంభించారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో.. భరోసా సెంటర్ ను ఏర్పాటుచేశారు.
త్వరలోనే గచ్చిబౌలిలో పర్మినెంట్ భరోసా సెంటర్ ను ఏర్పాటవుతుందని సీపీ సజ్జనార్ తెలిపారు. “ఇప్పుడున్న భరోసా షీ టీం అధికారులు అద్బుత ఫలితాన్ని తీసుకొస్తున్నారు. త్వరలోనే సైబర్ క్రైం సెంటర్ ని కూడా భరోసాసెంటర్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా భరోసా మీకు అండగా ఉంటుంది. దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకునేలా ఈ సెంటర్ పని చెయ్యాలని కోరుతున్నా. భరోసా సెంటర్ ఏర్పాటులో సహకరించిన గత కలెక్టర్ రఘునందన్ గారు, ప్రస్తుత కలెక్టర్ లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.

Leave a Comment