అతివేగానికి మరో ప్రాణం బలి !

తెలుగు న్యూస్ టుడే ➤ అతి వేగం ప్రమాదకరం అని తెలిసినా ఎవరు పట్టించుకోరు, ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసినా ఎవరు మారరు. అతి వేగంతో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నశ్రీక్రిష్ణ ట్రావెల్స్‌ బస్సు మునగాల దగ్గర అదుపు తప్పి పల్టీ కొట్టి.. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రీట్ మెంట్ కోసం దగ్గర్లోని హాస్పిటల్ తరలించారు. సంఘటనా స్ధలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. అతి వేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

Leave a Comment