టాలీవుడ్ నటుడి పేరుతొ న‌కిలీ ఫేస్ బుక్ ఐడీ!

తెలుగు న్యూస్ టుడే ➤ జయంబు.. నిశ్చయంబు.. రా , గీతాంజలి చిత్రాలతో కమెడియన్ నుంచీ హీరోగా మారాడు శ్రీనివాస‌రెడ్డి. ప్రస్తుతం అనేక చిత్రాల్లో సపోర్ట్ నటుడిగా చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి తాజాగా తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయిందని ఈ విష‌యం శ్రీనివాస రెడ్డికి చేర‌డంతో ఆయ‌న వెంట‌నే త‌న‌కి చెడ్డ పేరు తెచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని సైబరాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసుల‌ని సంప్ర‌దించి స‌ద‌రు వ్య‌క్తిపై ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో కొంద‌రు న‌కిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి అమాయ‌కుల‌కి గాలం వేసి మోసం చేస్తున్నారు. ర‌వికిర‌ణ్‌ అనే వ్య‌క్తి గ‌తంలో ఆర్టిస్ట్‌ల‌ కింద అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. ఆ ప‌రిచ‌యాల‌ని అడ్డుపెట్టుకున్న ఆ వ్యక్తి న‌కిలి ఫేస్ బుక్ ఐడీల‌ని క్రియేట్ చేసి సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాను, మంచి క‌థ‌లు ఉంటే పంపాల‌ని ప‌లువురితో చాటింగ్ చేశాడ‌ట‌.

పోలీసులు నేరాన్ని అంగీక‌రించిన వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంకోసారి ఇలాంటి నేరాల‌కి పాల్పొడ‌ద్ద‌ని హెచ్చరించారు.

Leave a Comment