5వ తెలంగాణ అమోచ్యూర్ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2018

తెలుగు న్యూస్ టుడే ➤ కరీంనగర్‌ జిల్లాలోని రెజ్లింగ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఇ- టెక్నోస్కూల్‌లో 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి అమోచ్యూర్ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2018 పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరుగునున్న ఈ పోటీలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మంది రెజ్లర్లు పోటీలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన రెజ్లర్లు జాతీయస్థాయి పోటీలలో రాష్ట్రానికి ప్రాతినిథ్యవహించనున్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి, డీవైఎస్‌వో అశోక్‌కుమార్, కరీంనగర్ జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కార్యదర్శి మహ్మద్ కరీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment