నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారం!

హైద్రాబాద్ న్యూస్ ➤ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌ వేదికగా జరిగింది. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. మొదట నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొత్త మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మంత్రులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.


ఇవాళ ప్రమాణం చేసిన కొత్త మంత్రులకు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులను అభినందించారు. ‘కొత్త మంత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని ట్వీట్ చేశారు. రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ నరసింహన్‌.. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిలతో ప్రమాణం చేయించారు.

Leave a Comment