భర్త కోసం పోలీసుల పైనే జులుమ్ !

తెలుగు న్యూస్ టుడే ➤ భర్త కోసం పోలీసుల పైనే జులుమ్ చేసిన మహిళ, ఈవిడేదో ఒక అనసూయ , సతీ సావిత్రి అనుకునేరు… ఈ మహిళ ఎవరూ చూడని అభ్యుదయ మహిళ.
ఇంతకీ ఆ మహిళ ఏమిచేసిందంటే భర్తకు తాగిచ్చి మరీ పోలీసులతో పోరాడింది…ఒక్క బీరు తాగితే పట్టుకుంటారా అని శివాలెత్తింది. భర్తకు సపోర్టుగా పోలీసులపై శివంగిలా దూకింది. వారితో ఫైట్ చేసింది. ఏపీ పోలీసును షేక్ చేసిన ఈ ఆధునిక మహిళ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ కాలంలో బీరు తాగడం కామన్.. నీళ్లు తాగినట్టే తాగేస్తున్నారు. ఆడవాళ్లు సైతం ఇష్టంగా లాగించేస్తున్నారు. అందుకే ఈ మహిళ కూడా తన భర్తకు ఓ బీరు తాగించింది. పార్టీయో.. పబ్బో కానీ భర్తకు తనే దగ్గరుండి మరీ ఇప్పించిదట.. భర్త తాగాడు. అనంతరం ఇద్దరూ కలిసి వాహనంపై బయలు దేరారు. తాగి రోడ్డెక్కితే పోలీసోళ్లు ఊరుకుంటారా…? డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుకున్నారు. అప్పుడు మొదలైంది

మహిళా శివాలెత్తింది. ‘నా మొగుడికి నేను తాగిస్తే మీకేంటి నొప్పి.. ఒక్క బీరుకే పట్టుకుంటారా.? ఒక మహిళనై నేనే తాగిస్తే మీరెందుకు తప్పుపడుతారు. ఒక్క బీరుకే కేసు పెడతారా..? అసలు తాగకుండా వైన్ షాప్ లు బంద్ చేయండి’ అంటూ మహిళా వీరావేశంతో రెచ్చిపోయింది.. ట్రాఫిక్ పోలీసులపై మహిళా దాడికి దిగడం.. పోలీసులు మహిళా అని చూడకుండా ఎదురుదాడి చేయడంతో రచ్చ రచ్చ అయిపోయింది. ఈ దాడిలో ఆ మహిళ పోలీసులని కూడా చూడకుండా నోటికి పని చెప్పింది. పోలీసులు కూడా ఆమెపై చేయిచేసుకున్నారు..

ఇలా ఈ మహిళ చేసిన పని వైరల్ అయ్యింది. మగవాళ్లంతా ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు భర్త తాగితే కొట్టే భార్యలను చూశాం కానీ.. ఇలా భర్తకు తాగించి ప్రశ్నించిన వారిని కొడుతున్న భార్యను మొదటి సారి చూశామని మందుబాబులు తెగ వైరల్ చేస్తున్నారు.

Leave a Comment