సెప్టెంబర్ 28 నుంచి తెలంగాణా గురుకుల ఉపాధ్యాయుల పరీక్షలు !

తెలుగు న్యూస్ టుడే ➤ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 24 వరకు సబ్జెక్టులవారీగా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు( ట్రైబ్) నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నాడు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పీజీటీ, టీజీటీలకు కామన్ పేపర్-1 గా ఒకటి ఉంటుంది.

మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ టూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-త్రీ పరీక్షలు ఉంటాయని వివరించారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి https://treirb.telangana.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని ట్రైబ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

Leave a Comment