హైదరాబాద్ లో జాబ్ మేళ రసాభాస !

తెలుగు న్యూస్ టుడే ➤ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటూ తెలిపిన ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ అధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో గందరగోళం ఏర్పడింది. శుక్ర, శని, ఆదివారాల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మహా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు కంపెనీ ముందునుంచి పెద్దస్థాయిలో ప్రచారంచేసింది. 35వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటూ తెలపడంతో… శుక్రవారం మొదటిరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయి కనిపించింది. వందకు పైగా కంపెనీలు స్టాల్స్ పెట్టాయి. వేల మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు వచ్చారు.
టాప్ క్లాసెస్, హైఎండ్ జాబ్స్ కూడా కల్పిస్తామని ప్రచారం చేయడంతో… హై క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎక్కువగా జాబ్ మేళాకు వచ్చారు. వందకు పైగా స్టాల్స్ లో ఉన్నీ అర్హతకు తక్కువగా ఉన్న ఉద్యోగాలు చూపిస్తున్నారంటూ ఎక్కువమంది అభ్యర్థులు గొడవకు దిగారు. సాఫ్ట్ వేర్ జాబ్స్ అని పిలిపించి.. సెక్యూరిటీ గార్డ్, ఫోర్త్ క్లాస్ జాబ్స్.. క్యాబ్ డ్రైవర్స్.. డెలివరీబాయ్స్… జాబ్స్ చూపించారని కొందరు ఆందోళనకు దిగారు. టాప్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ కు స్థాయికి తగ్గ ఉద్యోగ అవకాశాలు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. ఒక్క సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా రాలేదని మండిపడ్డారు.

బ్యానర్స్ చింపేసి నిరుద్యోగులు గొడవ చేయడంతో… స్టాల్స్ ను మూసేసి కంపెనీ ప్రతినిధులు, నిర్వాహకులు వెళ్లిపోయారు. పేపర్ యాడ్ లో ఒకరకంగా చెప్పి.. నిరుద్యోగ యువతను దూర ప్రాంతాలనుంచి రప్పించి మోసం చేశారని అభ్యర్థులు ఆరోపించారు. సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ పరిస్థితిని సమీక్షించారు. శనివారం జాబ్ మేళాకు ఎవరినీ రావొద్దని సూచించారు. ఆదివారం మూడోరోజు జాబ్ మేళాకు పోలీసులు ముందుగానే పర్మిషన్ ఇవ్వలేదు. మహా ఉద్యోగ మేళా నిర్వాహకుడు బి.వెంకటేశ్వర్లుపై కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Leave a Comment