నిజామాబాద్ జిల్లాలో తెరాస బహిరంగ సభ !

 

తెలుగు న్యూస్ టుడే ➤తెలంగాణ రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికల నగారా మ్రోగిందని తెలిసిందే, ఇప్పటికే తెరాస కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు . ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరికాసేపట్లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభ కోసం ఇందూరు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. గిరిరాజ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో కళాకారులు ఆటపాటలతో అలరిస్తున్నారు. జై తెలంగాణ పాటలతో సభా ప్రాంగణం మార్మోగిపోతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు.. ఉప్పెనలా తరలివస్తున్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్.. సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తొలి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ నాంది పలికిన విషయం విదితమే.

Leave a Comment