తెలంగాణా ఎన్నికల నోటిఫికేషన్ నగారా మ్రోగింది

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేశారు. నవంబర్ 19 వరకు.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు 19 చివరి తేదీ. అలాగే నవంబర్ 20న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. 22 వరకు నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించారు.
డిసెంబర్ 7న ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో (సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం) సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగనుంది. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో… పోలింగ్ ను గట్టి బందోబస్త్ మధ్య నిర్వహించి.. ముందుగానే పోలింగ్ ను పూర్తిచేయనున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ ఐదు గంటల వరకు జరుగుతుంది. డిసెంబర్ 11న ఫలితాలు విడుదల కానున్నాయి.

Leave a Comment