తెలంగాణా ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల !

తెలుగు న్యూస్ టుడే ➤ పోలీస్ శాఖలో కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై), ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 9న ఈ పరీక్షలు జరిగాయి. ఎస్సై కమ్యూనికేషన్ పరీక్షకు 10,809 మంది హాజరుకాగా.. 4,684 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు. ఏఎస్సై ఫింగర్‌ప్రింట్ బ్యూరో ప్రిలిమ్స్ పరీక్షకు 6,013 మంది హాజరుకాగా.. 3,276 మంది అభ్యర్థులు అర్హత పొందారు.

అర్హులైన అభ్యర్థుల జాబితాను www.tslprb.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు శ్రీనివాసరావు తెలిపారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో పార్ట్ – 2 దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.

Leave a Comment