ఉత్తరాంధ్రలో తిత్లీ విధ్వంసం !

తెలుగు న్యూస్ టుడే ➤ తిత్లీ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర అతలాకుతలమవుతోంది. తుఫాన్ అలర్ట్ ప్రకటించినప్పటికీ … ప్రఛండ గాలీ వానతో మరింత బీభత్సం సృష్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ధాటికి ఇద్దరు మృతి చెందారు. వంగర మండలం ఓనిఅగ్రహారంలో చెట్టు విరిగిపడి అప్పల నరసమ్మ(62), సరుబుజ్జిలి మండలంలో ఇల్లరు కూలి సూర్యారావు(55) మృతి చెందారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తిత్లీ తుపానుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు కేంద్ర కేబినెట్ సచివాలయం, హోంమంత్రిత్వ శాఖ వివరాలను తెలుసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అధికారుల నుంచి కేంద్రం సమాచారం తీసుకుంటోంది. ఆర్మీ, నావికాదళం, కోస్టుగార్డ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం.. బృందాలకు ఆదేశాలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చింది.

Leave a Comment